Thursday, January 23, 2025

రోడ్డు ప్రమాదం కేసులో తొలిసారి రూ.కోటి పరిహారం..

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: రాష్ట్రంలోనే తొలిసారిగా రోడ్డు ప్రమాదం కేసులో కోటి రూపాయాల పరిహారాన్ని ఇప్పించిన సంఘటన శనివారం ఖమ్మం నగరంలో జరిగిన లోక్ అదాలత్ లో చోటు చేసుకుంది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా శ్రీనివాసరావు చొరవతో 2019 మే నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా ప్రాజెక్టు లిమిటెడ్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న గంగుల త్రినాధ్ మరణించాడు. ఆయన తల్లిదండ్రులు, భార్య ఖమ్మం కోర్టులో భీమా కంపెనీపై కోటి రూపాయలకు కేసు దాఖలు చేశారు. ఇట్టి కేసును శనివారం ఖమ్మం కోర్టులో జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో రాజీకి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిపాదించారు.

ఇరు పక్షాల వారిని పిలిపించి బీమా కంపెనీతో రాజీకి మార్గం కల్పించి కక్షిదారులకు కోటిరూపాయల పరిహారం ద్వారా అవార్డు జారీ చేశారు. రోడ్డు ప్రమాదం కేసులో ఇంత పెద్ద మొత్తంలో పరిహారం లభించడం తెలంగాణాలోనే ఇది ప్రథమం అని బీమా కంపెని న్యాయవాది తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అబ్దుల్ జావేద్ పాషా, బార్ అసోసియోషన్ అధ్యక్షుడు గొల్లపూడి రామారావు, న్యాయమూర్తులు ఆర్. డేనీరూథ్, ఎన్.అమరావతి, కె.ఆశారాణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News