Friday, December 20, 2024

మైనర్ బాలిక రేపిస్టులకు రూ. 1 లక్ష జరిమానా!

- Advertisement -
- Advertisement -

మైనర్ బాలిక రేపిస్టులకు రూ. 1 లక్ష జరిమానా!
ఛత్తీస్‌గఢ్‌లో గ్రామ పెద్దల పంచాయతీ

జష్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాకు చెందిన కన్సాబెల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన బయటకు పొక్కకుండా ఉండేందుకు బాధితురాలికి లక్ష రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని నిందితులను పంచాయతీ పెద్దలు ఆదేశించినట్లు వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్టు చేశారు. జష్‌పూర్ ఎఎస్‌పి ప్రతిభా పాండే మంగళవారం విలేకరుల సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. జులై 9వ తేదీన ఒక పెళ్లికి హాజరై ఇంటికి తిరిగి వస్తున్న ఒక 16 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలియడంతో మరుసటి రోజున గ్రామానికి చెందిన పెద్దలు పంచాయతీ పెట్టి రాజీ ప్రయత్నాలు చేశారు. బాధితురాలికి లక్ష రూపాయలు జరిమానా కట్టాలని నిందితులను పంచాయతీ పెద్దలు ఆదేశించారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో పోలీసులు గ్రామనికి చేరుకుని బాధితురాలితోపాటు ఆమె తండ్రి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నిందితులపై సోమవారం కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎఎస్‌పి తెలిపారు. అవసరమైతే పంచాయతీ పెద్దలను కూడా అరెస్టు చేస్తామని ఆమె చెప్పారు.

Rs 1 lakh fined to Accused for raped minor girl

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News