Monday, January 20, 2025

గజానికి లక్ష!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కోకాపేట నియోపాలిస్ భూముల మాదిరిగానే మోకిల ప్లాట్లు కూడా వేలంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఐటీ కారి డార్‌కు సమీపంలోని మోకిలలో మొదటి దశలో 50 ప్లాట్లను హెచ్‌ఎండిఏ సోమవారం వేలం వేయగా భారీ స్పందన వచ్చిం ది. ఈ ప్లాట్ల విక్రయంతో ప్రభుత్వానికి రూ. 121.40 కోట్ల ఆ దాయం వచ్చింది. గజానికి లక్ష పైచిలుకు ఆదాయం లభిం చింది. 50 ప్లాట్ల వేలంతో రూ. 40 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా అంచనాలను తలకిందులు చేస్తూ మూడు రెట్లు అధికంగా ఆదాయం సమకూరింది. మోకిల్లాలో చదరపు గజం ధర గరిష్ఠంగా రూ. 1.05 లక్షలు పలకగా చ దరపు గజం ధర కనిష్ఠంగా రూ. 72 వేలు పలికింది.సగటున రూ. 80,397లు పలికింది. సోమవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 25 ప్లాట్లకు వేలం వేసింది.

మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటకు వరకు మరో 25 ప్లాట్లకు హెచ్‌ఎండిఏ వేలం నిర్వహించింది. ఉద యం జరిగిన వేలంలో గజానికి అత్యధికంగా ఒక లక్షా 5 వేల ధర పలకడం విశేషం. ఐటి కారిడార్ సమీపంలో ఉన్న మో కిలలో హెచ్‌ఎండిఎ  మొత్తం 165 ఎకరాల్లో భారీ లే ఔట్‌ను అభివృద్ధి చేస్తోంది. శంకర్‌పల్లి టు మెహిదీపట్నం రోడ్డు నుంచి 2 కి.మీ లోపలికి ఉన్న ఈ లేఔట్‌లో మొదటి దశలో 50 ప్లాట్లను విక్రయిస్తే విశేష స్పందన రావడంతో వెంటనే రెండో దశ వేలాన్ని త్వరలోనే నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన షెడ్యూలు త్వరలోనే ప్రకటిస్తామని హెచ్‌ఎండిఏ అధికారులు తెలిపారు. మొదటి దశ వేలం 50 ప్లాట్ల విస్తీర్ణం (15,800 గజాలు)ను విక్రయించామని, కనీస మద్దతు ధరను రూ.25 వేలుగా నిర్ణయిస్తే మూడు రెట్లు అధికంగా పలికిందని, ఇది హెచ్‌ఎండిఏ చేస్తున్న అభివృద్ధి పట్ల ఉన్న నమ్మకంతోనేని అధికారులు తెలిపారు. నేడు షాబాద్ భూములను ప్రభుత్వం వేలం వేయనుంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News