Monday, January 20, 2025

బిసి కులాలన్నింటికీ లక్ష రూపాయల ఆర్థిక సాయం వర్తింపచేయాలి

- Advertisement -
- Advertisement -
బిసి బందు పథకం వెంటనే అమలు చేయాలి
5.77 లక్షల పెండింగ్ ధరఖాస్తులకు సబ్సిడీ రుణాలివ్వాలి
బిసి యువజన సంఘం రాష్ట్ర సమావేశం డిమాండ్

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం 14 బిసి కుల వృత్తులకు ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని బిసి జాబితాలోని 130 కులాలకు వర్తింపచేయాలని రాష్ట్ర బిసి యువజన సంఘం డిమాండ్ చేసింది. సోమవారం బిసి భవన్‌లో బిసి యువజన సంఘం విస్తృత స్థాయి సమావేశం రాష్ట్ర అధ్యక్షులు నీల వెంకటేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధులుగా ఆర్. కృష్ణయ్య, విహెచ్ హనుమంత రావు, బిసి నాయకులు ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ, అంజి, సుధాకర్, అనంతయ్య, సి. రాజేందర్, రాజ్ కుమార్, తిరుమలగిరి అశోక్, రామ కృష్ణ, భూపేష్ సాగర్, సతీష్, నంద గోపాల్, రాందేవ్, మల్లేశ్ పటేల్, నాగ రామ చారి, రవి కుమార్, అఖిల్, ప్రసన్న కుమార్, శ్యామ్ ప్రసాద్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య, విహెచ్ మాట్లాడుతూ బిసి లలో కొన్ని కులాలకు మాత్రమే లక్ష ఆర్థిక సాయం ఇచ్చి మిగతా కులాలకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. బిసి జాబితాలోని అన్ని కులాలకు, కుల వృత్తులు ఉన్నాయని ముఖ్యంగా పద్మశాలి, ముదిరాజ్, గౌడ, యీడిగ, గోల్ల, కురుమ, మున్నూరు కాపు, బెస్త, బోయ, వాల్మీకి, బలిజ, లింగాయత్ తదితర 130 కులాలకు కూడా లక్ష రూపాయలు పథకాన్ని అమలు చేయాలి కోరారు. బిసి కార్పొరేషన్ కు 100 కోట్లు బడ్జెట్ విడుదల చేశారు. ఇది ఏ మూలకు సరిపోదని అన్నారు. రాష్ట్రంలో 62 లక్షల బిసి కుటుంబాలు ఉన్నాయని అందరికీ సబ్సిడీ రుణాలు ఇవ్వడానికి 10 వేల కోట్లు బడ్జెటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ హామినిచ్చిన బిసి బంధు పథకాన్ని వెంటనే ప్రకటించి అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రతి బిసి కుటుంబానికి రూ. 10 లక్షలు మంజూరు చేయాలన్నారు.

బిసి రుణాల కోసం పెండింగ్‌లో ఉన్న 5.77 లక్షల దరఖాస్తులను పరిష్కరించాలని, దరఖాస్తు చేసుకున్న ప్రతి బిసి కుటుంబానికి సబ్సిడీ రుణాలు మంజపరు చేయాలని డిమాండ్ చేశారు. బిసి కార్పొరేషన్, ఎంబిసి కార్పొరేషన్, 12 బిసి కుల ఫెడరేషన్లు ఒక్క రుణం కూడా ఇవ్వకుండా ఈ 9సంవత్సరాల కాలంలో నిర్వీర్యం అయ్యాయి. ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా బిసి కార్పొరేషన్ ఈడి – పోస్టులు పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 40 వేల టీచర్ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News