Saturday, November 23, 2024

భవాని కత్తికి రూ.10 కోట్లు

- Advertisement -
- Advertisement -

ప్రధాని బహుమతుల ‘ఈ-వేలం’లో టోక్యో హీరోల వస్తువులకు అనూహ్య స్పందన

న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయనకు వివిధ సందర్భాలు, పర్యటనల్లో బహుమతులుగా లభించిన వస్తువులను ఇ వేలం నిర్వహించారు. శుక్రవారం ప్రారంభమైన ఇవేలంలో టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులు భారత ప్రధానికి ఇచ్చిన పరికరాలు, దుస్తులను వేలానికి ఉంచారు. ఇవేలంలో ఆయా క్రీడాకారుల వస్తువులకు అనూహ్య స్పందన లభిం చింది. ఈ క్రమంలో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ఫెన్సర్ భవానీదేవి కత్తి (ఫెన్స్)కి అనూ హ్య ధర లభించింది. టోక్యో క్రీడల్లో భవానీ దేవి పతకం సాధించడంలో విఫలమైంది. కానీ ఆమె అద్భుత ఆటతో అలరించింది.

ఇదిలావుంటే టోక్యో గేమ్స్‌లో తాను ఉపయోగించిన కత్తిని భవానీ దేవి ప్రధానికి బహూకరిచారు. ఈ కత్తికి వేలం పాటలో అనూహ్య స్పందన లభించింది. భవానీదేవి కత్తి ఏకంగా పది కోట్ల రూపాయల రికార్డు ధర పలికింది. అంతగాక పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి న షట్లర్ కృష్ణ నాగర్ ఉపయోగించిన రాకెట్ ధర కూడా రూ.10 కోట్లకు చేరింది. మరోవైపు కృష్ణ నాగర్ రాకెట్‌కు బేస్ ధరకు రూ.80 లక్షలుగా నిర్ణయించారు. అయితే దీనికి కూడా అనూహ్యం పది కోట్ల రూపాయల ధర లభించడం గమనార్హం. పారాలింపిక్స్‌లో రజతం సాధించిన మరో షట్లర్ సుహాన్ యతిరాజ్ రాకెట్‌ను వేలానికి పెట్టగా దానికి కూడా రూ.10 కోట్ల ధర లభించింది.

సింధుకు రాకెట్‌కు రూ. 90 లక్షలు

మరోవైపు భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు రాకెట్‌కు రూ. 90 లక్షల ధర దక్కింది. రూ.80 లక్షల బేస్ ధరతో ఈ రాకెట్‌ను వేలం పాటలో ఉంచారు. ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆమె రాకెట్‌ను కూడా ఈవేలంలో ఉంచారు. దీంతో సింధు రాకెట్ ధర ఇప్పటికే రూ.90 లక్షల ధరను అందుకుంది. ఇక టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన యువ సంచలనం నీరజ్ చోప్రా ఉపయోగించిన ఈటెకు రూ.1.20 కోట్ల ధర లభించింది. రూ. కోటి బేస్ ధరతో నీరజ్ ఈటెను వేలం పాటలో ఉంచారు. కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన యువ బాక్సర్ లవ్లీనా బొర్గొహెన్ చేతి గ్లౌజులను కూడా ఈవేలం పాటలో ఉంచారు. దీనికి కూడా అనూహ్య ధర లభించింది.

ఇప్పటికే లవ్లీనా గ్లౌజుల ధర రూ.1.80 కోట్లకు చేరుకోవడం విశేషం. ఇదిలావుండగా కేంద్ర సాంస్కృతి శాఖ ఈ వేలం పాటను నిర్వహిస్తోంది. శుక్రవారం ప్రారంభమైన ఇవేలం అక్టోబర్ ఏడు వరకు కొనసాగనుంది. ఇవేలం పూర్తయిన తర్వాత అత్యధిక ధరతో బిడ్ వేసిన వారికి ఈమెయిల్ ద్వారా దీనికి సంబంధించిన సమాచారం అందిస్తారు. కాగా, ఈ కార్యక్రమం ద్వారా సమకూరే నిధులను గంగా నది ప్రక్షాళన కోసం చేపట్టిన నమామి గంగే కార్యక్రమం కోసం వెచ్చిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News