- Advertisement -
కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలోని కొండపల్లి గ్రామంలో ఏనుగు దాడిలో కారుపోషన్న అనే మరో వ్యక్తి మృతి చెందడం పట్ల అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియాను చెల్లిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గుండా ఆసిఫాబాద్ జిల్లాల్లోకి ప్రవేశించిన ఏనుగు వరుస దాడుల నేపథ్యంలో చింతలమానేపల్లి, పెంచికల్ పేట్, బెజ్జూర్, దహెగాం ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను విధించినట్లు మంత్రి సురేఖ తెలిపారు. అటవీ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని స్పష్టం చేశారు. సాధారణ పరిస్థితి నెలకొనేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సురేఖ ప్రజలకు సూచించారు.
- Advertisement -