Saturday, November 23, 2024

స్టాక్ మార్కెట్ లో రూ.10 లక్షల కోట్లు హాంఫట్!

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత దేశీయ స్టాక్ మార్కెట్లను యుద్ధ మేఘాలు కుదేలును చేశాయి. గత వారం దాకా దూసుకెళ్లిన సూచీలు గురువారం ట్రేడింగ్ లో పతనాన్ని చూశాయి. ఇరాన్, ఇజ్రాయెల్  యుద్ధ వాతావరణం కారణంగా మదుపర్లు జాగ్రత్త వహించారు. మరోవైపు క్రూడ్ బ్యారెల్ ధర గురువారం 75 డాలర్లకు పెరిగింది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సైతం ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ నిబంధనలను కఠినతరం చేసింది. చైనా ప్రభుత్వం ఉద్దీపన ప్రకటనలు చేయడంతో అక్కడి మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతోంది.  భారత్ కు విదేశీ పెట్టుబడులు తగ్గిపోయి ఈక్విటీలపై ప్రభావం పడింది. ఇండియా విక్స్ 9.86 శాతం(+1.18) పెరిగి 13.17 వద్ద ముగిసింది.

దేశీ స్టాక్ మార్కెట్లో గురువారం ఈ ఏడాది మూడో అతిపెద్ద సింగిల్ డే లాస్ నమోదయింది. బిఎస్ఈ లో నేడు రూ. 9.71 లక్షల కోట్లు కరిగిపోయి రూ. 465.15 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ వద్ద ముగిసింది. దీనికి ముందు ఇలాగే  జూన్ 4న,  ఆగస్టు 5న కూడా భారీ పతనం నమోదయింది. నేడు(గురువారం) సెన్సెక్స్ 1769.19 పాయింట్లు లేక 2.09 శాతం క్షీణించి 82497.10 వద్ద క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 546.81 పాయింట్లు లేక 2.12 శాతం నష్టపోయి 25250.10 వద్ద క్లోజ్  అయింది. నిఫ్టీలో జెఎస్ డబ్ల్యు స్టీల్, ఓఎన్ జిసి షేర్లు ప్రధానంగా లాభపడగా, బిపిసిఎల్, శ్రీరామ్ ఫిన్, ఎల్ టి, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ప్రధానంగా నష్టపోయాయి.

స్వచ్ఛమైన బంగారం పది గ్రాములు రూ. 354.00 నష్టపోయి 75312.00 వద్ద ట్రేడయింది. డాలరుతో భారతీయ కరెన్సీ 0.14 పైసలు లాభపడి రూ. 83.97 వద్ద ట్రేడయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News