Saturday, November 16, 2024

గిఫ్ట్ ఏ స్మైల్‌కు రూ.10 లక్షల విరాళం

- Advertisement -
- Advertisement -

దివ్యాంగులు చేయూతనివ్వాలని మంత్రి కెటిఆర్ పిలుపు

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ దివ్యాంగులకు తమవంతు సహాయం చేయాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. మంత్రి కెటిఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్ ’లో భాగంగా గతంలో ప్రభుత్వ దవాఖానలకు అంబులెన్స్‌లను ఇవ్వగా, ఈ సారి దివ్యాంగులలో చిరునవ్వును చూడాలనే గొప్ప ఆలోచనతో మూడు చక్రాల మోటార్ వాహనాలు అందివ్వాలని పిలుపునివ్వగా అద్భుత స్పందన వచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి నియోజకవర్గాల్లో ఉన్న దివ్యాంగులకు మోటారు వాహనాలు అందిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కె. వాసుదేవారెడ్డి ఆధ్వర్యంలో వెంకటేశ్వర్‌రెడ్డి రూ.10 లక్షల చెక్‌ను గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి మంత్రి కెటిఆర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమకు అందుబాటులో ఉండే దివ్యాంగులకు చేయూతను అందించాలని మంత్రి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News