Wednesday, January 15, 2025

కన్యత్వ పరీక్షలో వధువు ఫెయిల్.. రూ.10 లక్షల జరిమానా

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాజస్థాన్‌లోని భిలారాలో ఒక 24 ఏళ్ల మహిళకు ఆమె అత్తమామలు కన్యత్వ పరీక్ష నిర్వహించగా అందులో ఆమె విఫలం కావడంతో పంచాయతీ పెద్దలు ఆమెకు రూ.10 లక్షల జరిమానా విధించారు. ఈ సంఘటనపై బాధిత మహిళ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం ఆమె అత్తమామలపై కేసు నమోదు చేశారు. ఈ ఏడాది మే 11న తన కుమార్తెకు భిల్వారాలో వివాహమైందని, అదే రోజే ఆమెకు కన్యత్వ పరీక్షను ఆమె అత్తమామలు జరిపించారని ఆ మహిళ తల్లిదండ్రులు పోలీసులకు తెలియచేశారు. కన్యత్వ పరీక్షలో విఫలం అయినందుకు తన కుమార్తెను ఆమె అత్తమామలు చిత్రహింసలకు గురిచేశారంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వివాహం జరగడానికి ముందే తాను అత్యాచారానికి గురయ్యానని, దీనిపై సుభాష్ నగర్ పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదైందని బాధిత మహిళ తన అత్తమామలకు తెలియచేసినట్లు పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

Rs 10 lakh fine on bride for failing in Virginity Test in Rajasthan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News