Sunday, December 22, 2024

రూ.10లక్షల హవాలా నగదు పట్టివేత

- Advertisement -
- Advertisement -

కారులో తరలిస్తున్న నగదును మలక్‌పేట పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.10లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…కారులో ఓ వ్యక్తి హవాలా నగదు తరలిస్తున్నాడని సమాచారం రావడంతో మలక్‌పేట పోలీసులు ఎస్‌బిఐ ఆఫీసర్ కాలనీ పార్క్, శాలివాహన నగర్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు.

అదే సమయంలో కారులో వస్తున్న బొక్క సాయి చరణ్ రియల్ ఎస్టేట్ వ్యాపారిని పోలీసులు ఆపి తనిఖీ చేయగా రూ.10,00,000 లక్షల నగదు లభించింది. వాటికి సంబంధించిన పత్రాలు చూపించాల్సిందిగా కోరగా విఫలమయ్యాడు. వెంటనే నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News