Wednesday, January 22, 2025

అవార్డు గ్రామాలకు రూ.10 లక్షల ప్రోత్సాహకం : మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర స్థాయిలో అవార్డులు తీసుకున్న ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు చొప్పున ప్రోత్సాహక బహుమతిగా అందజేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం రాష్ట్ర స్థాయి స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ అవార్డులు -2023 విజేతలను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో అవార్డులు వచ్చిన ఈ 40 గ్రామాలు జాతీయ స్థాయిలో అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు. కేంద్ర సహకరించకపోయినా, నిధులు ఇవ్వకపోయినా అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందిందన్నారు.

అవార్డులు తీసుకున్న ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు చొప్పున ప్రోత్సాహక బహుమతిగా వెంటనే అంద చేయాలని ముఖ్య కార్యదర్శి, కమిషనర్లను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మానస పుత్రిక పల్లె ప్రగతి వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు. వివిధ అంశాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మిగతా రాష్ట్రాలకు సూచించిన కేంద్రం రాష్ట్రానికి అన్ని రంగాల్లో సహాయనిరాకరణ చేస్తున్నదన్నారు. కేంద్రం సహకరిస్తే రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ధి చెందేదని పేర్కొన్నారు.

స్వచ్ఛ సర్వేక్షణలో దేశంలో మనమే నెంబర్ వన్ గా ఉన్నాం.. ఏడాదిలోనే 20 అవార్డుల ప్రకటిస్తే 19 అవార్డులు సాధించాం. అనేక అంశాల్లో ఆన్‌లైన్‌లో వేసే మార్కుల్లోనూ మన పల్లెలు మొదటి స్థానంలో నిలిచాయి. ఈ సారి కూడా మన రాష్ట్రం నుంచి వివిధ కేటగిరీల్లో 600లకు పైగా ఎంట్రీలను పంపిందన్నారు. కచ్చితంగా అనేక అవార్డులను సాధించి తీరుతామనే నమ్మకం ఉందన్నారు.భవిష్యత్‌లో తెలంగాణ పల్లెలు మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, సెర్ప్ సిఈఓ గౌతం, స్పెషల్ కమిషనర్ ప్రదీప్, ఎస్‌జిఎం డైరెక్టర్ సురేష్, డిప్యూటీ కమిషనర్లు రామారావు, రవీందర్, యూనిసెఫ్ డైరెక్టర్ వెంకటేష్, జిల్లాల ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News