Sunday, January 5, 2025

కారు అద్దాలు పగులగొట్టి రూ.10 లక్షలు అపహరణ

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి జిల్లా, జోగిపేట పట్టణంలో సోమవారం మిట్ట మధ్యాహ్నం పోలీసు స్టేషన్ ముందు భారీ చోరీ జరిగింది. జోగిపేటకు చెందిన రవీందర్‌రెడ్డి విద్యుత్ శాఖలో ఎడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. మధ్యాహ్న సమయంలో స్థానిక ఎస్‌బిఐ బ్యాంక్‌లో రూ.10 లక్షలు డ్రా చేసుకొని తన కారులో ముందు సీటులో పెట్టారు. స్వీట్లు కొనటానికి వెళ్లేందుకు పోలీస్ స్టేషన్ ముందు కారు నిలిపి రోడ్డు క్రాస్ చేశాడు. షాపులో స్వీటు తీసుకొని కారు వద్దకు వచ్చేలోపే గుర్తు తెలియని వ్యక్తులు కారు అద్దాలు పగులగొట్టి రూ.10 లక్షలు బ్యాగ్ ఎత్తుకెళ్లారు. ఆయన వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం వివరించారు.

సిఐ సంఘటన స్థలానికి వచ్చి పగిలిన కారు అద్దాలను పరిశీలించారు. వెంటనే బ్యాంక్‌కు వెళ్లి సిసి ఫుటేజీని పరిశీలించారు. తన సిబ్బందితో గాలింపు చేపట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పాండు తెలిపారు. కాగా, పోలీస్ స్టేషన్ ముందు గతంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు పని చేయడం లేదు. అవి పనిచేసి ఉంటే నిందితుడిని సులువుగా పట్టుకునేందుకు వీలుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సిసి కెమెరాలు మరమ్మతు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News