- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల వేళ ఖమ్మం ప్రజలకు మంత్రి కెటిఆర్ శుభవార్త చెప్పారు. మంత్రి పువ్వాడ వినతి మేరకు ఖమ్మం కార్పొరేషన్ కు కెటిఆర్ రూ.100 కోట్లు నిధులు మంజూరు చేశారు. ఇవాళ కెటిఆర్ గా చేతుల మీదుగా మంత్రి పువ్వాడ జీవో కాపీని అందుకున్నారు. ఖమ్మం అభివృద్ధికి రూ. 100 కోట్ల నిధులు ఇచ్చినందుకు కెటిఆర్ కు పువ్వాడ ధన్యవాదాలు తెలియజేశారు.
- Advertisement -