Friday, November 22, 2024

ముంబై ఎయిర్ పోర్టులో రూ.100 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

ముంబై: ముంబై విమానాశ్రయంలో భారీ ఎత్తున మత్తుమందు హెరాయిన్ పట్టుబడింది. దీని విలువ రూ. 100 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆఫ్రికన్ దేశమైన మలావీ నుంచి ఖతార్ మీదుగా ముంబైకి వస్తున్న ఓ ప్రయాణికుడు దేశంలోకి మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్టు అందిన సమాచారం మేరకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) అధికారులు ముంబై లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాపు కాశారు. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపు లోకి తీసుకుని విచారించగా బండారం బయటపడింది. మలావీ ప్రయాణికుల లగేజీని తనిఖీ చేయగా, ట్రాలీ బ్యాగు కావిటీస్ తయారు చేసి దాచిన 16 కిలోల హెరాయిన్ బయటపడింది. వారిచ్చిన సమాచారం మేరకు ఢిల్లీ లోని ఒక హోటల్‌లో బస చేసిన ఘనా మహిళను అరెస్టు చేశారు. స్థానిక కోర్టు వీరిని డీఆర్‌ఐ కస్టడీకి తరలించింది.

Rs 100 crore worth heroin seized at Mumbai Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News