Sunday, December 22, 2024

రూ. 100 లంచం చాలా చిన్న మొత్తం: బాంబే హైకోర్టు

- Advertisement -
- Advertisement -

ముంబై: లంచం పుచ్చుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న కేసులో ఒక ప్రభుత్వ వైద్యాధికారిని నిర్దోషిగా నిర్ధారిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన బాంబే హైకోర్టు సదరు వైద్యాధికారి 2007లో లంచంగా పుచ్చుకున్నట్లు ఆరోపిస్తున్న రూ. 100 అప్పుడే కాదు ఇప్పుడు కూడా చాలా స్వల్ప మొత్తమని అభిప్రాయపడింది. ఈ కేసును తేలికపాటి వ్యవహారంగా పరిగణించాలని జస్టిస్ జితేంద్ర జైన్‌కు చెందిన సింగిల్ బెంచ్ పేర్కొంది.

మహారాష్ట్రలోని పుణె జిల్లా పాడ్‌లోగల గ్రామీణ ఆసుపత్రిలో 2007లో వైద్యాధికారిగా పనిచేస్తున్న డాక్టర్ అనిల్ షిండే వద్దకు ఎల్‌టి పింగలే అనే వ్యక్తి వచ్చాడు. తనపై తన బంధువు ఒకరు దాడి చేశాడని, తనకు కలిగిన గాయాలకు సంబంధించి సర్టిఫికెట్ ఇవ్వాలని పింగలే కోరాడు. ఇందుకోసం రూ. 100 లంచంగా ఇవ్వాలని డాక్టర్ అనిల్ షిండే అడగడంతో ఈ విషయాన్ని సింగలే అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) దృష్టికి తీసుకెళ్లాడు.

ఎసిబి అధికారులు వలసన్ని రూ. 100 లంచం పుచ్చుకుంటున్న డాక్టర్ షిండేను అరెస్టు చేశారు. దీనిపై విచారణ జరిగిన అనంతరం డాక్టర్ షిండే నిర్దోషి అంటూ 2012 జనరవిలో ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. మంగళవారం ఈ కేసుపై తీర్పు ఇచ్చిన హైకోర్టు డాక్టర్ షిండేను నిర్దోషిగా పేర్కొంటూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

2007లో రూ. 100 లంచంగా పుచ్చుకున్నట్లు ఈ కేసులో ఎసిబి ఆరోపిస్తోంది. ఆ డబ్బు అప్పుడే కాదు ఇప్పుడు కూడా చాలా స్వల్పమైనది. నిందితుడిపై సాక్ష్యాలను ఫిర్యాదుదారు నిరూపించని కారణంగా నిందితుడిని నిర్దోషిగా కోర్టు పరిగణించింది. హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థిస్తోంది అంటూ న్యాయమూర్తి పేర్కొన్నారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News