Thursday, January 23, 2025

రూ. 1000 కోట్ల బ్యాంకు డిపాజిట్ల స్వాహా కేసులో ఒకరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: ప్రజల నుంచి సేకరించిన రూ. 1000 కోట్ల మేరకు డిపాజిట్లు దుర్వినియోగం అయిన శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంకు కుంభకోణంలో రాజేష్ విఆర్ అనే వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం అరెస్టు చేసింది. బ్యాంకు యాజమాన్యంతో కుమ్మక్కై బ్యాంకు నుంచి స్వాహా చేసిన నిధులలో అధిక భాగం రాజేష్ దక్కించుకున్నట్లు ఇడి తెలిపింది. ఆర్‌బిఐ తనిఖీ నివేదికలో పేర్కొన్న ప్రకారం బ్యాంకు నుంచి రూ. 40.40 కోట్లు రుణంగా తీసుకున్న రాజేష్ వాటిని ఎగ్గొట్టాడు.

రాజేష్, అతని భార్య మరి కొన్ని సహకార బ్యాంకులు, సొసైటీలలో కూడా రుణాలు తీసుకుని ఎగ్గొట్టినట్లు అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు కూడా తమ దృష్టికి వచ్చిందని ఆర్‌బిఐ తన నివేదికలో తెలిపింది. వారిద్దరూ ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ఆర్‌బిఐ పేర్కొంది. మార్కెట్ రేటు కన్నా అధిక వడ్డీలు చెల్లిస్తామన్న హామీతో బ్యాంకు యాజమాన్యం డిపాజిటర్ల నుంచి పెద్దమొత్తంలో డిపాజిట్లను సేకరించినట్లు ఇడి గుర్తించింది. బ్యాంకు యాజమాన్యం నకిలీ పేర్లతో రుణ ఖాతాలను తెరచి వాటిలోకి డబ్బును బదిలీ చేసినట్లు కూడా తేలింది. కాగా..రాజేష్‌ను బెంగళూరులోని ప్రిన్సిపాల్ సిటీ సివిల్ అండ్ సెషన్స్ జడ్జి ఎదుట హాజరుపరచగా అతనికి మూడు రోజుల ఇడి కస్టడీకి అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News