Monday, January 20, 2025

భద్రాచలం కరకట్టకు కెసిఆర్ రూ.1000 కోట్లు ప్రకటించారు: రేగా

- Advertisement -
- Advertisement -

MLA Rega kantha rao

భద్రాద్రి కొత్తగూడెం: వరదల వల్ల జరిగే నష్టం నుంచి ప్రజలను శాశ్వతంగా గట్టెక్కించేందుకు సిఎం కెసిఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రశంసించారు. టిఆర్ఎస్ ఎల్పీ కార్యాయం నుంచి రేగా కాంతారావు మీడియాతో మాట్లాడారు. భద్రాచలానికి ఇరు వైపులా కరకట్టలను నిర్మించేందుకు వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించడం మామూలు విషయం కాదన్నారు. మా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల తరపున కృతజ్ఞతలు సిఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో వరదలు వచ్చినపుడు పట్టించుకున్న నాథూడే లేడన్నారు.  ఈ వరదల్లోనూ కొన్ని పార్టీల నేతలు  బురదరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ ను రాజకీయాల కతీతంగా అందరూ అభినందించాలన్నారు. కెసిఆర్ రుణం తీర్చుకునేలా తాము కంకణ బద్ధులమై పని చేస్తామన్నారు. ఈ ప్రెస్ మీట్ లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మ్మెల్యే ఎం. నాగేశ్వర్ రావు, ఎమ్మెల్సీ తాత మధు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News