Friday, December 20, 2024

12 నుంచి పంట నష్టం సాయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఈ నెల 12వ తేదీ నుంచి పంట సాయం ప్రభుత్వం అందజేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. నష్టపోయిన వరి పంటకు ఎకరాకు రూ. 10 వేలు ఇస్తామని చెప్పారు. కౌలు రైతులకు కూడా పరిహారం అందిస్తామని వెల్లడించారు. వర్షాలతో తడిసిపోయిన పంటలను చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. పంట నష్ట పరిహారంపై కాంగ్రెస్, బిజెపి నేతలు రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

ప్రతిపక్షాల మాటలను రైతులు నమ్మొద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పంట నష్టానికి ఎకరాకు రూ.10 ’వేలు ఇస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో రూ. 7.500 మాత్రమే ఇస్తున్నారని వివరించారు, తడిసిన వడ్లను కూడా తెలంగాణలోనే కొంటున్నారని.. ఇతర రాష్ట్రాల్లో కొనడం లేదన్నారు. కాంగ్రెస్, బిజెపి నేతలు నాటకాలా డుతున్నారని, వాళ్లు పరిపాలించే రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారో రైతులు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News