Wednesday, January 22, 2025

ఆర్టీసికి కాసుల వర్షం… పండుగకు రూ.107 కోట్ల ఆదాయం

- Advertisement -
- Advertisement -

Rs 107 crore revenue to tsrtc for festival
మనతెలంగాణ/హైదరాబాద్:  సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసికి కాసుల వర్షం కురిపించింది. అధిక ఆదాయం రావడంపై ఆర్టీసి యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది. ఆర్టీసిని ఆదరించిన ప్రయాణికులకు ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి సజ్జనార్ కృతజ్ఞతలు తెలియజేశారు. సంక్రాంతి సందర్బంగా టిఎస్ ఆర్టీసి సాధారణ షెడ్యూల్ బస్సులకు అదనంగా సుమారు 4వేల బస్సులను ఈనెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నడిపించింది.

ఆర్టీసిలో సుమారు 55 లక్షల మంది ప్రయాణికులను ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చామని ఆర్టీసి ప్రకటించింది. తద్వారా ఆర్టీసీకి రూ.107 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. కరోనాకు ముందు ఆర్టీసికి రోజుకు రూ.12 కోట్ల పైచిలుకు ఆదాయం వచ్చేది. కానీ సంక్రాంతి సమయంలో రోజుకు సుమారు రూ.15.2 కోట్ల పైచిలుకు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News