- Advertisement -
రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది. మంగళవారం ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. కువైట్ నుంచి వచ్చిన నరేంద్ర్ అనే ప్రయాణికుడి నుంచి రూ.11లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.
Rs 11 lakh worth gold seized in Shamshabad Airport
- Advertisement -