- Advertisement -
హైదరాబాద్: ఏడాదిలో 300 రోజుల పాటు ఆరోగ్య లక్ష్మి పథకాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. శాసన సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్ర సత్యవతి రాథోడ్ మాట్లాడారు. ఆరోగ్య లక్ష్మి ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. ఆరోగ్య లక్ష్మి పథకం కింద 21 లక్షల 83 వేల 560 మంది లబ్ది పొందుతున్నారని, ఇప్పటివరకు ఆరోగ్య లక్ష్మి పథకం కోసం రూ.1110.89 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. మనం ఇస్తున్న బాలామృతం ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలని కేంద్రం అడిగిందన్నారు.
- Advertisement -