Monday, December 23, 2024

నాలుగో రోజు రైతుబంధుకు రూ.1131 కోట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సాగుకు సబంధించి రైతుబంధు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రూ.1131కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసింది. మొత్తం 6,64,717 మంది రైతుల ఖాతాలలో ఈ నిధులు జమ చేసింది.దీంతో ఈ సీజన్‌లో ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.4377.42 కోట్లు జమ అయ్యాయి. ఈ 11 విడతతో మొత్తం రైతుల ఖాతాలలో రైతుబంధు నిధులు రూ.72,910 కోట్లకు చేరుకోనున్నాయి.ఈ ఒక్క సీజన్ లోనే రూ.7720 కోట్లు రైతుల ఖాతాలలో జమకానున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News