Monday, December 23, 2024

గీత కార్మికులకు రూ.12.50కోట్ల ఎక్స్‌గ్రేషియా విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గీత వృత్తిలో పనిచేస్తూ ప్రమాదానికి గురైన గీత కార్మికులకు ప్రభుత్వం రూ.12.50 కోట్ల ఎక్స్‌గ్రేషియాను విడుదల చేసింది. ఈ సందర్భంగా నిధుల విడుదలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ శనివారం వెల్లడించారు. గౌడ వృత్తిదారుల కోసం కోకాపేటలోని 5 ఎకరాల్లో నిర్మిస్తున్న ఆత్మగౌరవ భవన నిర్మాణానికి జరిగే భూమి పూజలో ఈ ఎక్స్‌గ్రేషియాను పంపిణీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఇకపై గీత కార్మికులకు రైతుబీమా మాదిరిగా గీత కార్మికుల బీమాను అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రమాదవశాత్తు తాటి, ఈత చెట్లపై నుంచి పడి మృతిచెందినా, శాశ్వత అంగ వైకల్యం చెందిన గీత కార్మికులకు అందించే ఎక్స్‌గ్రేషియాను నేరుగా వారి అకౌంట్లలో వారం రోజుల వ్యవధిలో జమ చేస్తామన్నారు.

గీత కార్మికులు వారి ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలు, లైసెన్సు వివరాలను, నామిని వివరాలను ఎక్సైజ్ శాఖ అధికారులకు అందజేయాలని మంత్రి సూచించారు. బాధితులు సమీపంలో ఉన్న ఎక్సైజ్ స్టేషన్‌లో వివరాలు వారం రోజుల వ్యవధిలో అందించాలని మంత్రి సూచించారు. బీమా స్కీంను సమర్థవంతంగా అమలయ్యేలా విధి, విధానాలు త్వరగా పూర్తి చేయాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను మంత్రి ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News