Wednesday, January 22, 2025

గుజరాత్‌లో రూ. 120 కోట్ల కొకైన్ స్వాధీనం

- Advertisement -
- Advertisement -

కచ్ జిల్లాలోని గాంధీధామ్ పట్టణ సమీపంలోని సమద్ర తీర ప్రాంతంలో 12 కిలోల కొకైన్‌గల 10 ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ. 120 కోట్లు ఉంటుందని సోమవారం పోలీసులు తెలిపారు. ఈ కొకైన్ ప్యాకెట్లను స్మగ్లర్లు దాచి ఉంటారని పోలీసులు తెలిపారు. గత ఏడాది కాలంలో ఇదే ప్రాంతం నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం ఇది మూడవసారని కచ్ ఈస్ట్ వివిజన్ ఎస్‌పి సాగర్ బాగ్మర్ తెలిపారు. తమకు అందిన సమాచారం ఆధారంగా సముద్ర తీర ప్రాంతంలో పోలీసులు ఆదివారం రాత్రి తనిఖీలు నిర్వహించగా ఎవరికీ చెందని 10 ప్యాకెట్ల కొకైన్ లభించిందని ఆయన చెప్పారు. దొరకకుండా తప్పించుకునేందుకే స్మగ్లర్లు వాటిని అక్కడ దాచి ఉంటారని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News