Thursday, December 19, 2024

రూ.120కోట్ల విలువైన మెఫెడ్రోన్ డ్రగ్ స్వాధీనం

- Advertisement -
- Advertisement -

ముంబై: ముంబై, గుజరాత్‌లో రూ.120 కోట్ల మేరకు విలువ చేసే 60 కిలోల మెఫెడ్రోన్ మాదకద్రవ్యాన్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సిపి) స్వాధీనం చేసుకుని మాజీ ఎయిర్ ఇండియా పైలట్‌తోసహా అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాకు చెందిన ఆరుగురు సభ్యులను అరెస్టు చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు శుక్రవారం నాడిక్కడ తెలిపారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన నౌకాదళ నిఘా విభాగం ఇచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు జరిగినట్లు ఎన్‌సిబి డిప్యుటీ డైరెక్టర్ సంజయ్ సింగ్ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు విస్తరించి ఉన్న డ్రగ్స్ వ్యవస్థను ఛేదించి, సిండికేట్‌లోని ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశామని ఆయన చెప్పారు. గత సోమవారం జామ్‌నగర్‌లో దాడి జరిపిన ఎన్‌సిబి అధికారులు 10 కిలోల మెఫెడ్రోన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. గురువారం దక్షిణ ముంబైలోని ఫోర్ట్ ప్రాంతంలోగల ఎస్‌బి రోడ్డులోని ఒక గోడౌన్‌పై దాడి జరిపి 50 కిలోల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకోవడంతోపాటు ఈ కేసులో సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తితోపాటు మరో సభ్యుడిని ఎన్‌సిబి అధికారులు అరెస్టు చేశారు. వీరిలో మాజీ ఎయిర్ ఇండియా పైలట్ కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు.

Rs 120 Crore worth Mephedrone drug Seized in Mumbai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News