Sunday, November 17, 2024

స్వేదపత్రం విడుదల చేసిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ఆకాశమంత ఎత్తులో అగ్ర రాష్ట్రంగా ఉందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ప్రగతి ప్రస్థానాన్ని స్వేదపత్రం పేరుతో బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ అస్థిత్వమే కాదు ఆస్తులు కూడా సృష్టించామని ప్రశంసించారు. 30 ఏండ్లలో రూ.4,98,053 కోట్లు ఖర్చు చేశారన్నది శుద్ధ అబద్ధమని, జనాభా ఆధారంగా తెలంగాణ వాటా అంటూ తప్పుడు లెక్కలు చూపారని మండిపడ్డారు. తెలంగాణలో గత పదేళ్ల ఖర్చు రూ.13,72,930 కోట్లుగా ఉందని, విద్యుత్ రంగంలో తాము సృష్టించిన ఆస్తుల విలువ రూ.6,87,585 కోట్లుగా ఉందని వెల్లడించారు.

విద్యుత్ స్థాపిత సామర్థాన్ని 778 మెగావాట్ల నుంచి 19,464 మెగా వాట్లకు పెంచామని, తలసరి విద్యుత్ వినియోగాన్ని 1196 యూనిట్ల నుంచి 2140 యూనిట్లకు పెంచామని, విద్యుత్ సామర్థం వచ్చే ఏడాదికి 26 మెగావాట్లకు పెరుగుతుందని ఆయన వివరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ సొంత గ్రామానికి మొన్నటి వరకు కరెంట్ సమస్య ఉందని, కానీ తెలంగాణలోని ఏ గ్రామానికి కరెంట్ సమస్యలేదన్నారు. కాళేశ్వరంలో ఒక్క బరాజ్‌లో చిన్న తప్పు మొత్తం ప్రాజెక్టునే తప్పుబడుతున్నారని, భారత దేశంలో భూగర్భజలాలు పెరగడానికి కారణం తెలంగాణే అని, కొత్తగా 50 లక్షల ఎకరాలకు సాగునీరు, ఆయకట్టు స్థిరీకరణ చేశామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News