Saturday, December 21, 2024

ఆర్‌బిఐ వేలంలో రూ. 1500 కోట్ల రుణ సమీకరణ

- Advertisement -
- Advertisement -

రూ. 25,400 కోట్ల రుణాలను సమీకరించనున్న 15 రాష్ట్రాలు

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మరి కొంత సొమ్ము రుణంగా తీసుకోనున్నది. అక్టోబర్ 31వ తేదీన (మంగళవారం) రిజర్వుబ్యాంక్ నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం అనుమతించడంతో.. రూ.1500 కోట్లను రుణంగా సమీకరించుకోనుంది. ఇందు కోసం 22 ఏళ్ల కాలానికి రూ.1000 కోట్లు, 14 ఏళ్ల కాలానికి రూ.500 కోట్ల చొప్పున రాష్ట్ర ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది. వేలం అనంతరం రాష్ట్ర ఖజానాకు ఆ మొత్తం సమకూరుతుంది. తెలంగాణతో పాటు మరో 14 రాష్ట్రాలు ఈ వేలం ద్వారా రూ. 25,400 కోట్ల రుణాలను సమీకరించనున్నాయి. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఈ- కుబేర్) విధానంలో ఈ వేలం నిర్వహించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News