Wednesday, January 22, 2025

అదృష్టం అంటే వీడిదే.. లాటరీలో రూ.13 వేల కోట్లు గెలుచుకున్నాడు..

- Advertisement -
- Advertisement -

కొడితే కొట్టాలిరా జాక్ పాట్ కొట్టాలీ అంటూ ఆ పెద్దమనిషి ఎప్పుడూ లాటరీ టికెట్లు కొంటూ ఉంటాడు. కానీ, ఏనాడూ జాక్ పాట్ తగిలిన దాఖలా లేదు. అయితేనేం, ఈ మధ్య 166 రూపాయలు పెట్టి ఓ లాటరీ టికెట్ కొంటే, అనుకోకుండా జాక్ పాట్ తగిలింది మరి! దాంతో ఆ పెద్దమనిషి ఆనందానికి అవధుల్లేవు. ఇంతకీ అతను గెలుచుకున్న మొత్తం ఎంతో తెలుసా? అక్షరాలా 13,339 కోట్లు!

అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి ‘మెగా మిలియన్’ లాటరీ టికెట్ కొన్నాడు. టికెట్ ఖరీదు 166 రూపాయలు. టికెట్ ను ఆ వ్యక్తి తన పేరుమీద కొనలేదు. తన అధీనంలో నడిచే సాల్టయిన్ హోల్డింగ్స్ అనే సంస్థ పేరిట కొన్నాడు. అతను కొన్న టికెట్ కు 160 కోట్ల డాలర్ల ప్రైజ్ మనీ లభించింది. అంటే ఇండియన్ కరెన్సీలో 13,339 కోట్లు అన్నమాట! నిజానికి సెప్టెంబర్ 27నే విజేత ఎవరో తేలిపోయినా, భద్రతా కారణాల దృష్ట్యా మూడు నెలల తర్వాత మాత్రమే అతని వివరాలను లాటరీ సంస్థ వెల్లడించింది. అన్నట్టు… ఈ టికెట్ అమ్మిన ఓ కిరాణా కొట్టు యజమానికి కూడా భారీమొత్తంలో కమీషన్ లభించింది. జాక్సన్ విల్లే ప్రాంతంలోని పబ్లిక్స్ గ్రోసరీ స్టోర్ అనే కిరాణాకొట్టు యజమానికి 83 లక్షల రూపాయల కమీషన్ దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News