రంగు రాళ్లతో పాటు నకిలీ నోట్ల దందా
రూ.17.72 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం
అసలు నోట్లుగా భావించి చోరీకి పాల్పడ్డ స్నేహితుడు, దుండగుల బృందం
రంగు రాళ్లు చోరీకి గురైనట్లు జ్యోతిష్యుడు మురళీకృష్ణ శర్మ ఫిర్యాదు, విచారణలో కొత్త మలుపు తీసుకున్న కేసు
మన తెలంగాణ/సిటీబ్యూరో/మన్సురాబాద్: రంగురాళ్ల చోరీ కేసు కొత్తమలుపు తిరిగింది. కే సును దర్యాప్తు చేసిన పోలీసులు నకిలీ నోట్ల దం దాను వెలుగులోకి తెచ్చారు. ఈ కేసులో ఎల్‌బినగర్ పోలీసులు, సిసిఎస్ పోలీసులు ఆరుగురు నిం దితులు, జ్యోతికష్యుడిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 6,32,000 నగదు (ఒరిజినల్ నో ట్లు), నకిలీ రెండు వేల రూపాయల నోట్లు రూ. 17.72 కోట్లు, కారు, పది మొబైల్ ఫోన్లను స్వా ధీనం చేసుకున్నారు. ఎల్‌బినగర్‌లోని రాచకొండ సిపి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం డిసిపి యాదగిరి వివరాలు వెల్లడించారు. ఎపిలోని గుం టూరు జిల్లా, పిడుగురాళ్ల మండలానికి చెంది న వేలుపూరి పవన్‌కుమార్ అలియాస్ చారీ మొబై ల్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు.
దొండపాటి రామకృష్ణ అలియాస్ కృష్ణ డ్రైవర్, నల్లబోతుల సురేష్‌గోపి అలియాస్ గోపి అలియాస్ సురేష్ వ్యాపా రం, చందులూరి విజయ్‌కుమార్ అలియాస్ విజయ్ పూజారి, కంభంపాటి సూర్యం అలియాస్ సూర్య, నాగోల్ బండ్లగూడకు చెందిన జ్యోతిష్యుడు బెల్లంకొండ మురళీకృష్ణ శర్మను పోలీసులు అరెస్టు చేశారు. నాగోల్‌లోని బండ్లగూడకు చెందిన మురళీకృష్ణ జ్యోతిష్యునిగా పనిచేస్తున్నాడు. అలాగే రంగు రాళ్లు విక్రయిస్తున్నాడు. ఈ నెల 15వ తేదీన మురళీకృష్ణ ఇంట్లో దొంగలు పడ్డారు. తన ఇంట్లో రూ.40లక్షల విలువైన రంగురాళ్లు చోరీకి గురయ్యాయని ఎల్‌బి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయడంతో నకిలీ కరెన్సీ విషయం బయటకు వచ్చింది. నాగేంద్రప్రసాద్, జ్యోతిష్యుడు మురళీకృష్ణకు దూరపు బంధువు. తన స్నేహితుడు పవన్‌ను మురళీకృష్ణ వద్ద పనిచేసేందుకు పెట్టాడు నాగేంద్రప్రసాద్.
పనిలో చేరిన పవన్ మురళీకృష్ణ వద్ద చాలా డబ్బులు ఉన్నాయని తెలుసుకున్నాడు. ఇద్దరు కలిసి ఒకరోజు రూ.10 కోట్ల నుంచి రూ. 12 కోట్లను బ్యాగుల్లో పెట్టారు. వాటిని నిజమైన నోట్లని భావించిన పవన్ మురళీకృష్ణ లగ్జరీ లైఫ్ చూసి పవన్ అసూయపడ్డాడు. మురళీకృష్ణ వద్ద ఉన్న డబ్బులు చోరీ చేయాలని అనుకున్నాడు. ఈ విషయం తన స్నేహితుడు మురళీకృష్ణ బంధువైన నాగేంద్రప్రసాద్‌కు చెప్పాడు. అతడు కూడా చోరీ చేసేందుకు ఒప్పుకున్నాడు. ఈ నెల 14వ తేదీన ఇద్దరు కలిసి పిడుగురాళ్లకు వచ్చి మిగతా స్నేహితులకు ప్లాన్ చెప్పారు. అందరు కలిసి కారు తీసుకుని చోరీ చేసేందుకు నగరానికి వచ్చారు. కారు నంబర్ ప్లేట్‌ను మార్చి నకిలీ నంబర్ ప్లేట్‌ను పెట్టారు. నాగేంద్రకుమార్ వడ్డేపల్లి బార్డర్ వద్ద ఉండి వాట్సాప్ కాల్ చేస్తూ నిందితులకు సూచనలు ఇచ్చాడు. అందరు కలిసి మురళీకృష్ణ ఇంటిక వచ్చి ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి రెండు ట్రాలీ బ్యాగుల్లోని డబ్బులు తీసుకుని పారిపోయారు.
బ్యాగులు తీసుకుని వెళ్లిన నిందితులు చౌటుప్పల్ వద్దకు వెళ్లిన తర్వాత బ్యాగులను తెరిచి చూడగా అందులో రంగురాళ్లు, వజ్రాలు లేవు.లోపల నకిలీ రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయి, పైన అసలైన ఒరిజినల్ రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయి. దీంతో ఖంగుతిన్న నిందితులు తమను పోలీసులు పట్టుకుంటారనే భయంతో నకిలీ నోట్లు ఉన్న బ్యాగులను దహనం చేశారు. ఒరిజినల్ నోట్లను తీసుకుని పిడుగురాళ్లకు వెళ్లారు. జ్యోతిష్యుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వాళ్లు నకిలీ నోట్ల విషయం బయటపెట్టారు. పోలీసులు జ్యోతిష్యుడు మురళీకృష్ణ ఇంటిపై దాడి చేసి నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
హవాలా కేసులో అరెస్టు
జ్యోతిష్యుడిగా పనిచేస్తున్న మురళీకృష్ణ శర్మ 2006లో విజయవాడలో రంగు రాళ్లను విక్రయించేవాడు. 2017నుంచి భక్తి నీది పేరుతో వెబ్‌సైట్ ఓపెన్ చేసి రంగురాళ్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాడు. సాక్షి, టివి5 ఛాన్లల్లో రంగురాళ్లపై లైవ్ షోలు నిర్వహించేవాడు. మురళీకృష్ణ 2017, జూన్‌లో నూరుద్దిన్ అనే వ్యక్తి విజయవాడలో కలిశాడు. అతడి మురళీకృష్ణకు ట్రేడ్ ప్రాఫిట్ ఫండ్ గురించి వివరించాడు. హేలి వేపూరి, నూరుద్దిన్ కలిసి నేరాలు చేస్తున్నారు. హేలి వేపూరి ఐఓబి మంగళగిరి బ్యాంక్ అధికారుల సాయంతో రూ.90 కోట్లను మురళీకృష్ణ భక్తి నీది హెచ్‌డిఎఫ్‌సి బ్యాం క్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. తర్వాత అందులో నుంచి రూ.10లక్షలు మురళీకృష్ణ తన పర్సనల్ బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు.
దీంతో బ్యాంకు అధికారులు అనుమానం వచ్చి వైజాగ్‌లోని సిబిఐ అధికారులకు సమాచారం ఇచ్చారు. జనవరి 30వ తేదీన దాడి చేసిన సిబిఐ అధికారులు హేలీ వేపూరి, మురళికృష్ణను హవాలా డబ్బుల కేసులో అరెస్టు చేశారు. ఫిబ్రవరిలో జైలు నుంచి విడుదలైన మురళీకృష్ణ హైదరాబాద్‌కు వచ్చి బండ్లగూడలో ఉంటున్నాడు. తన వద్ద కోట్లాది రూపాయలు ఉన్నాయని, పైస్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయని చెప్పుకునేవాడు. ట్రేడ్ ఫ్రాఫిట్ పేరుతో బ్యాగుపైన ఒరిజినల్ నోట్లు, కింద నకిలీ రెండు వేల రూపాయల నోట్లు పెట్టి మోసం చేస్తున్నాడు. ఈ విధంగా న్యూఢిల్లీకి చెందిన ద్వివేదికి రూ.7లక్షలు, ముంబాయికి చెందిన హిమాయత్‌ను రూ.10లక్షలు, సుబ్బూను రూ.5లక్షలు ముంచాడు.
Rs 17 cr fake currency seized in Astrologer Muralikrishna house