- Advertisement -
న్యూఢిల్లీ: మణిపూర్‌లో ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పిఎంజిఎస్‌వై) పరిధిలో రూ.1700 కోట్ల మేర స్కామ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ గురువారం ఆరోపించింది. ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తునకు డిమాండ్ చేసింది. భారీగా లంచాలు చేతులు మారాయని ఈ కుంభకోణానికి బాధ్యులైన మంత్రులు, అధికారులు ఇతరులపై దర్యాప్తు జరిపి, దోషులను తీవ్రంగా శిక్షించాలని మణిపూర్ పిసిసి అధ్యక్షులు కె మేఘచంద్ర డిమాండ్ చేశారు.
ఈ మేరకు చంద్ర ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసి పంపించారు. తమ సారధ్యంలో ఓ బృందం జరిపిన పరిశీలనలో ఈ రోడ్‌స్కామ్ వెలుగులోకి వచ్చిందని, తమ వెంట మీడియా ప్రతినిధులు కూడా వచ్చారని వివరించారు. మూడు జిల్లాల్లో రోడ్ల పేరిట భారీగా అవినీతి చోటుచేసుకుందని నిజాలు వెలుగులోకి వస్తే బిజెపి డబుల్ ఇంజిన్ నినాదాలు ఎంతటి బూటకాలనేవి తేలుతాయని మేఘచంద్ర వ్యాఖ్యానించారు.
- Advertisement -