Wednesday, January 22, 2025

రూ.2 వేల నోట్ల ముద్రణకు కోట్లలో ఖర్చు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆర్‌బిఐ ప్రకారం రూ.2000 నోట్ల ముద్రణకు మొత్తం రూ.17,688 కోట్లు ఖర్చయినట్లు ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. రూ.2000 నోట్ల ముద్రణకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేసింది? అని పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజు లోక్‌సభలో ఆర్థికమంత్రిని ఈ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానంలో ఆర్‌బిఐ ప్రకారం, 2000 రూపాయల నోట్ల ముద్రణ కోసం మొత్తం 17,688 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

క్లీన్ నోట్ పాలసీలో భాగంగా 2023 మే 19న రూ. 2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నోట్లను ఉపసంహరించుకోవాలని ఆర్‌బిఐ ప్రకటించినప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థలో రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు ఉన్నాయి. నవంబర్ 30 వరకు దీనిలో రూ. 3.46 లక్షల కోట్ల విలువైన నోట్లు తిరిగి వచ్చాయి. రూ. 9,760 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయి, అవి బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి రావాల్సి ఉంది. బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ ఆర్‌బిఐ(భారతీయ రిజర్వ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News