Wednesday, January 22, 2025

బేగంబజార్‌లో రూ.18లక్షలు సీజ్

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదును బేగంబజార్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి పట్టుకున్నారు. ఓ వ్యాపారి తన లావాదేవీలు ముగించుకుని అర్ధరాత్రి రూ.18 నగదుతో ఇంటికి బయలు దేరాడు. ట్రాన్స్‌పోర్టు వ్యాపారి సురేష్ వర్మ కారులో గోషామహల్ నుంచి మాలకుంటా మీదుగా ఇంటికి వెళ్తుండగా సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆపారు. కారును తనిఖీ చేయగా అందులో రూ.18లక్షలు లభించాయి. నగదుకు సంబంధించిన పత్రాలు చూపించాల్సిందిగా కోరగా, విఫలమయ్యాడు, వెంటనే పోలీసులు రూ.18లక్షలను సీజ్ చేసి బేగంబజార్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన బేగంబజార్ పోలీసులు నగదును ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News