Friday, November 22, 2024

బ్యాంకుకు కన్నం

- Advertisement -
- Advertisement -

సినీ ఫక్కీలో 6కేజీల బంగారం, రూ.18లక్షల నగదు చోరీ
పెద్దపల్లి జిల్లా గుంజపడుగు ఎస్‌బిఐలో అర్ధరాత్రి దోపిడీ

మన తెలంగాణ/మంథని/పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యా ంక్‌లో బుధవారం రాత్రి దోపిడి జరిగింది. గుంజపడుగు ఎస్‌బిఐ బ్యాంకులో దోపిడి చేసిన దుండగులు బ్యాంక్‌లోని రూ.18.46 లక్షల నగదు, ఆరు కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బంగారం విలువ, నగదుతో కలసి రూ.3 కోట్ల 10 లక్షలు దోచుకెళ్లారు. దొంగలు బ్యాంకులోని కిటికీలను చాకచక్యంగా తీసి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా ముందు జాగ్రత్త తీసుకున్నట్లు తెలుస్తుంది. బ్యాంక్ దోపిడి చేసిన వారు స్థానికులా.. లేకుంటే బ్యాంక్ సిబ్బందా.. అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. బ్యాంకులోని సొత్తును దోచుకెళ్లిన దొంగలు అతి జాగ్రత్తగా బ్యాంక్‌లోని సిసి కెమెరాల కనెక్షన్ కట్ చేసి డివిఆర్ తీసుకెళ్లడంతో ఇది ఎ వ్వరు చేసి ఉంటారన్న విషయం మంథనిలో చర్చాంశనీయమైంది. బ్యాంక్ మేనేజర్ ప్రహ్లాద్ పింగవా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.
దొంగలను పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలు: సిపి సత్యనారయణ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దొంగతనం చేసిన వారు పక్కా ప్రొఫెషనల్ గ్యాంగేనని రామగుండం సిపి సత్యనారయణ అన్నారు. బ్యాంక్‌లో దొంగతనం చేసిన దుండగులు ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారని ఐనప్పటికీ కేసును తాము చేధించి దొంగ లను పట్టుకుంటామన్నారు. బ్యాంక్ వెనుక భాగంలోని కిటికీని జాగ్రత్తగా తొలగించి బ్యాంక్‌లోని అలారం మోగకుండా జాగ్రత్త పడ్డారని తెలిపారు. బ్యాంక్‌లోని స్ట్రాంగ్ రూంలోకి చొరబడి పగుల కొట్టడానికి వీలులేనటువంటి లాకర్‌ను గ్యాస్ కట్టర్‌తో కట్‌చేసి అందులోని 6 కిలోల బంగారం, రూ.18 లక్షల 46 వేల నగదును ఎత్తుకెళ్లారన్నారు. దోపిడి చేయడంతో ఇప్పటి వరకు ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ దొరకలేదని అయినప్పటికీ కేసును చేధించి దొంగలను పట్టుకుంటామన్నారు. దొంగలను పట్టుకునేందుకు బ్యాంక్ సెక్యూరిటీ వింగ్ సహాయంతో రామగుండం కమీషనర్ పోలీసులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కేసును అతి త్వరలో డిటెక్ట్ చేయడమే తమ ఉద్దేశమన్నారు. ముఖ్యంగా ఈ కేసును చేధించే దిశగా 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కమీషనర్ వెంట ఓఎస్డీ శరత్ పవార్, డిసిపి రవీంధర్, మంచిర్యాల డిసిపి ఉదయ్ కుమార్, ఏసిపి ఉమేంధర్, జైపూర్ ఏసిపి నరేంధర్‌లతో పాటు పోలీసులు పాల్గొన్నారు.

Rs 18 lakh Stolen from SBI Bank in Peddapalli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News