Monday, December 23, 2024

గట్టుప్పల్ లో రూ.19 లక్షలు పట్టివేత

- Advertisement -
- Advertisement -

 

మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నారు. గట్టుప్పల్ శివారులో 19 లక్షల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. గట్టుప్పల్ నుంచి పుట్టపాక  వెళ్ళే  దారిలో పోలీసుల తనిఖీలు చేపట్టారు. టిఎస్ 07 ఎఫ్ వై 9333 అనే నంబర్ గల కారులో 19 లక్షల రూపాయలను తరలిస్తుండగా పట్టుకున్నారు.  కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని డబ్బుపై పోలీసులు విచారిస్తున్నారు. కారులో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ లభ్యమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News