- Advertisement -
పెద్దపల్లి జిల్లా రామగుండంలో భారీగా నగదు పట్టుబడింది. రామగుండం ఎన్టీపీసీ కృష్ణనగర్ లోని ఓ ఇంట్లో ఎస్ఎస్ టి అధికారులు తనిఖీలు చేసి రూ.2.18కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టి అక్రమంగా దాచిన నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎన్నికల అదికారులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న వందల కోట్ల రూపాయలతోపాటు భారీగా బంగారు, వెండి నగలు పట్టుబడ్డాయి.
- Advertisement -