Sunday, December 22, 2024

రూ.2.7లక్షల టమాటా దొంగతనం.. పోలీసులకు రైతు ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: దేశంలో టమాటా ధరలు భారీగా పెరగడంతో వాటిపై దొంగల కన్ను పడింది. రైతు పండించిన టమాటాలను దొంగలిస్తూ హల్ చల్ చేస్తున్నారు. తాజాగా కర్నాటకలోని హసన్‌ జిల్లా బేలూర్ లో దొంగలు టమాటాలను దోచుకెళ్లారు. దీంతో రైతు పోలీసులను ఆశ్రయించాడు. తన పొలంలో పండించి 90 బాక్సుల టమోటాలను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దోచుకెళ్లిన టమాటాల విలువ మార్కెట్ లో రూ.2.7 లక్షలు ఉంటుందని రైతు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేయనున్నట్లు తెలిపారు. కాగా, ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమాటా ధరలు మండిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో కిలో టమాటా ధర రికార్డు స్థాయిలో రూ.150 పలుకుతోంది.

Also Read: మూత్రం బాధితుడి కాళ్ళు కడిగి సన్మానించిన మధ్యప్రదేశ్ సిఎం.. (వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News