Wednesday, January 22, 2025

నిఖత్ జరీన్, ఇషాసింగ్‌లకు రూ.2కోట్లు నగదు బహుమతి

- Advertisement -
- Advertisement -

బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్‌లో ఇంటి స్థలం

పద్మశ్రీ కిన్నెరమెట్ల మొగిలయ్యకు
రూ. కోటి నగదు పురస్కారం

బిఎన్ రెడ్డి నగర్ కాలనీలో ఇంటిస్థలం

మన తెలంగాణ/హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా బాక్సింగ్ పోటీ ల్లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్‌తో పాటు జర్మనీలో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన ఈషాసింగ్‌లకు ఒక్కొక్కరికి రూ 2. కోట్ల నగదు బహుమతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగదు బహుమతితో పాటు వీరికి బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో నివాసయోగ్యమైన ఇంటిస్థలాన్ని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

మొగిలయ్యకు కోటి నగదు పురస్కారం

సిఎం కెసిఆర్ ప్రకటించిన విధంగా పద్మశ్రీ కిన్నెరమెట్ల మొగిలయ్యకు రూ. 1కోటి నగదు పురస్కారాన్ని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పద్మశ్రీ మొగిలయ్య కోరుకున్నట్టుగా బిఎన్ రెడ్డి నగర్ కాలనీలో నివాస యోగ్యమైన ఇంటి స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News