Thursday, January 16, 2025

రూ. 2 లక్షల రుణమాఫీ చేశాం: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు నుంచే హామీల అమలు ప్రారంభించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే మహిళలకు ఆర్‌టిసిలో ఉచిత ప్రయాణం ప్రారంభించామని వివరించారు. గాంధీభవన్‌లో టిపిసిసి అధ్యక్ష బాధ్యతలు మహేష్ కుమార్ గౌడ్ స్వీకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి పిసిసి అధ్యక్ష బాధ్యత లు మహేష్ కుమార్ స్వీకరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆర్‌టిసిలో మహిళలు ఇప్పటివరకు 85 కోట్ల ప్రయాణాలు చేశారని, మోడీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను పెంచి మహిళలకు భారంగా మార్చిందని, గ్యాస్ సిలిండర్ మూలకు పడడంతో రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామన్నారు. చెప్పిన మాట ప్రకారం పంద్రాగస్టులోపే రూ. 2 లక్షల రుణమాఫీ చేసి చూపించామని, వ్యవసాయ రుణం రూ.2 లక్షలకు పైగా ఉన్న రైతులు బయపడొద్దని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రూ. 2 లక్షలకు పైగా ఉన్న మొత్తాన్ని రైతులో బ్యాంకులో చెల్లిస్తే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ పూర్తి అవుతుందన్నారు. కెసిఆర్ కుటుంబంలో ఉద్యోగాలు పోతేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని అనాడే చెప్పానని, ఇప్పటికే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామన్నారు. కరెంట్ బిల్లులకు భయపడి ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లు వాడలేదని, అందుకే ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇచ్చి విద్యార్థులకు ఎంతో మేలు చేశామని రేవంత్ రెడ్డి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News