Wednesday, January 22, 2025

తిరుమల లడ్డూ కౌంటరులో రూ.2 లక్షలు చోరీ..

- Advertisement -
- Advertisement -

తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్న కార్పొరేషన్ ఉద్యోగి నుండి రూ.2 లక్షలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. వివరాల్లోకి వెళితే.. శ్రీ లక్ష్మీ శ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా తిరుమల లడ్డూ కాంప్లెక్సులో నెల క్రితం రాజా కిషోర్ అనే వ్యక్తి కౌంటర్ బాయ్ గా విధుల్లో చేరాడు.

సోమవారం రాత్రి 36వ కౌంటరులో విధులు ముగించుకుని లడ్డూల విక్రయం ద్వారా వసూలైన రెండు లక్షల రూపాయలను తన వద్దే ఉంచుకొని గడియ పెట్టడం మరిచిపోయి కౌంటరులోనే నిద్రపోయాడు. ఉదయం నిద్ర లేచి చూసేసరికి నగదు సంచి కనిపించకపోవడంతో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలించి పాత నేరస్తుడైన సీతాపతి అనే అనుమానితుడిని గుర్తించారు.

పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా లడ్డూ కాంప్లెక్స్ కు అదనంగా 20 మంది సెక్యూరిటీ గార్డులను నియమించారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో లడ్డూ కౌంటర్లలో పనిచేస్తున్న సిబ్బందికి కౌంటర్ల నిర్వహణ, నగదు నిర్వహణ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News