Wednesday, January 22, 2025

పారిశుద్ధ్య కార్మికురాలి కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు జె.దుర్గమ్మ కుటుంబ సభ్యులకు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎక్స్‌గ్రేషియాను అందజేశారు. జె.దుర్గమ్మ అనే పాశుద్ద కార్మికురాలు తన విధుల్లో భాగంగా గత జనవరి 4వ తేదీ హయత్ నగర్ సర్కిల్ ఆటో నగర్ హై వే పై స్వీపింగ్ చేస్తుండగా చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయపడడంతో సనత్ నగర్ ఈ.ఎస్.ఐ ఆసుపత్రిలోకి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ జనవరి 14న మరణించారు. దీంతో శానిటేషన్ కార్మికురాలు దుర్గమ్మ బాధిత కుటుంబ సభ్యులకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శుక్రవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయం తన ఛాంబర్‌లో రూ.2 లక్షల చెక్‌ను అందజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News