Wednesday, January 22, 2025

యాక్షన్ సీన్ కోసం రూ.20కోట్లు!

- Advertisement -
- Advertisement -

Rs 20 Crore for Action Scenes in Salaar

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్‌లో ‘సలార్’ ఒకటి. ఈ పవర్‌ఫుల్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ‘సలార్’పై బాలీవుడ్ ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ‘కెజిఎఫ్’ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఇది. ఇక ఈ సినిమా ప్రీ క్లైమాక్స్‌లో ఓ యాక్షన్ సీక్వెన్స్ ఏకంగా 20 కోట్లు ఖర్చు పెట్టారట. హాలీవుడ్ స్థాయిలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుందని తెలిసింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతి హాసన్ నటిస్తోంది. ఆమెది ట్రాజెడీ క్యారెక్టర్ అని.. ప్రభాస్ – శృతిహాసన్‌ల మధ్య ట్రాక్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుందని సమాచారం. ఇక ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. ఈ సాంగ్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ స్టెప్పులు వేయనుందని తెలిసింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రాన్ని సమ్‌థింగ్ స్పెషల్‌గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడట.

Rs 20 Crore for Action Scenes in Salaar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News