Monday, January 20, 2025

రామ్ చరణ్ సినిమాలో ఒక్క రొమాంటిక్ పాటకే రూ.20 కోట్లు ఖర్చు?!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దర్శకుడు శంకర్ గొప్ప సినిమాను తీస్తున్నారు.  ఆయన తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. అందులో రామ్ చరణ్, కియరా అద్వానీ నటిస్తున్నారు. కాగా ఆ తాజా చిత్రం తయారీకి సంబంధించిన విషయం ఒకటి తెలిసింది. అదేమిటంటే  ఆ సినిమాలోని ఒక్క పాట తయారీకే శంకర్ పెద్ద ఎత్తున రూ. 20 కోట్లు ఖర్చుపెట్టాడట.

చక్కని సినిమాటోగ్రఫీ, కొరియోగ్రఫీతో స్టన్నింగ్ లొకేషన్ లో ఈ పాట చిత్రీకరించారట. ప్రేక్షకులకు అదిరిపోయేలా ఈ పాట చిత్రీకరిస్తున్నారట.  మరచిపోలేని పాటలా దీనిని రూపొందిస్తున్నారని అనుకుంటున్నారు. తన సినిమాల్లో పాటలకు పెద్ద ఎత్తున్న ఖర్చు చేస్తాడని శంకర్ కి పేరుంది. ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో కూడా అదే చేస్తున్నాడని అనుకుంటున్నారు.

రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ లో నటించాక వస్తున్న లేటెస్ట్ సినిమా ఇది. రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు  ఈ సినిమా కోసం. సంక్రాంత్రి పండుగకు ముందే అంటే 2025 జనవరి 10న ఈ సినిమా విడుదల కానున్నది. ‘గేమ్ ఛేంజర్’ సినిమా బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టడం ఖాయమని అనుకుంటున్నారు.

Ramcharan Song

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News