Monday, December 23, 2024

శానిటేషన్ కోసం రూ.200 కోట్లు ఖర్చు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శానిటేషన్ కోసం ప్రతి బెడ్‌కు రూ.7500 కేటాయించామని మంత్రి హరీష్ రావు తెలిపారు. సుల్తాన్ బజార్ మెటర్నిటీ ఆస్పత్రిలో సర్జికల్ పరికరాలను మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారు. నెలలోగా కొత్త శానిటేషన్ పాలసీని తీసుకొస్తామన్నారు. శానిటేషన్ కోసం అదనంగా రూ.200 కోట్లు ఖర్చు చేయబోతున్నామన్నారు. పారిశుధ్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. శానిటేషన్, డైట్ టెండర్లలో ఎస్‌సిలకు రిజర్వేషన్లు కల్పించామన్నారు. హైదరాబాద్‌లోని 18 ఆస్పత్రుల్లో ఉచిత భోజనం అందిస్తున్నామన్నారు.

ఈ నెల 12న ఉచిత భోజనం పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే హెల్త్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య 30 శాతం నుంచి 56 శాతానికి పెరిగిందని, ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని హరీష్ రావు కొనియాడారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు టి డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆదర్శంగా తీసుకున్నాయన్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 11న రేడియాలజీ ల్యాబ్‌లను ప్రారంభిస్తామని, మొత్తం 12 రేడియాలజీ ల్యాబ్‌లు అందుబాటులోకి తెస్తామన్నారు. బస్తీ దవాఖానాల ద్వారా ప్రజల చెంతకే వైద్య సదుపాయాలు అందుతున్నాయని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌ఎంఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News