Friday, December 27, 2024

శివసేన చిహ్నం కోసం రూ. 2000 కోట్లు చేతులు మారాయి: సంజయ్ రౌత్

- Advertisement -
- Advertisement -

ముంబై: ‘శివసేన’ పార్టీ పేరు, ‘విల్లు, బాణం’ గుర్తు కోసం రూ. 2000కోట్లు చేతులు మారాయనం ఉద్ధవ్ థాకరే గ్రూప్ ప్రధాన ప్రతినిధి సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి వాటిని కేటాయించిన మరునాడే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఆదివారం రెండు ట్విట్టర్ పోస్ట్‌లను పెట్టారు. ఒకటి మరాఠిలో, ఇంకొకటి హిందీలో. ఇంటరాక్షన్ సందర్భంగా ఆ ఆరోపణలను పునరావృతం చేశారు. ఆయన తన ట్వీట్‌లను ప్రధాని కార్యాలయం, భారత ఎన్నికల సంఘం(ఈసిఐ)కు కూడా ట్యాగ్ చేశారు.

‘పార్టీ పేరు, చిహ్నం పొందేందుకు రూ. 2000 కోట్లు ఇంత వరకు చేతులు మారాయన్నది నాకు తెలుసు. ఇది తొలి సంఖ్య. కానీ 100 శాతం వాస్తవం. త్వరలో మరిన్ని వివరాలు వెలికి వస్తాయి. దేశంలో ఇలాంటివి ఇంతకు ముందు ఎన్నడూ జరుగలేదు’ అని రౌత్ తన మైక్రోబ్లాగింగ్ సైట్‌లో పోస్ట్ చేశారు.

తర్వాత రౌత్ విలేకరులతో మాట్లాడుతూ ఆ రూ. 2000 కోట్లు ‘కేవలం ప్రాథమిక సమాచార నివేదిక’ అన్నారు. ‘దీనిని నేను పూర్తి బాధ్యతాయుతంగా చెబుతున్నాను. రూ. 50 లక్షలు కార్పొరేటర్లకు, రూ. 50 కోట్లు ఎంఎల్‌ఏలకు, రూ. 100 కోట్లు ఎంపీలకు..ఇక పార్టీ చిహ్నంకు ఎంత ఖర్చు చేసి ఉంటారో మీరే ఊహించండి. రూ. 2000 కోట్లు’ అని రౌత్ ఆరోపించారు. ‘వారికి సన్నిహితుడైన ఓ బిల్డరు’ నుంచే తనకు ఈ సమాచారం అందినట్లు ఆయన తెలిపారు. కాగా ఈ ఆరోపణలపై బిజెపి నుంచి వెంటనే ప్రతిచర్య మాత్రం రాలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News