Wednesday, January 22, 2025

నాలుగు కంటైనర్ల కరెన్సీ పట్టివేత?

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని పామిడి వద్ద నాలుగు కంటైనర్ల కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. ఒక్కో కంటైనర్‌లో రూ.500 కోట్ల చొప్పున మొత్తం నాలుగు కంటైనర్లలో రూ.2 వేల కోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కంటైనర్లలో 500 నోట్లు ఉన్నట్ల ప్రాథమికంగా గుర్తించారు. కొచ్చి నుంచి హైదరాబాద్ వస్తుందని ఆర్‌బిఐ అధికారులు తెలిపారు. రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఫార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యాన్ని పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News