లోక్‌సభలో ప్రశ్నకు మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానం
న్యూఢిల్లీ : 2016 లో పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్లను రద్దు చేసిన తరువాత గత రెండేళ్లుగా రూ.2000 నోట్లను ముద్రించడం లేదని సోమవారం లోక్‌సభలో కేంద్రం ప్రకటించింది. దీనిపై సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తూ 2018 మార్చి 30 నాటికి మొత్తం 336.2 కోట్ల రూ.2000 నోట్లు చెలామణీలో ఉన్నాయని 2021 ఫిబ్రవరి 26 నాటికి వీటి సంఖ్య 249.9 కోట్లకు తగ్గిందని వివరించారు. ఫలానా నోట్లు కావాలని వచ్చిన డిమాండ్ మేరకు రిజర్వుబ్యాంకుతో ప్రభుత్వం సంప్రదించి ముద్రణకు నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. 2019 2020 , 202021 మధ్యకాలంలో రూ.2000 నోట్లు కావాలని ఎలాంటి డిమాండ్ కానీ ఇండెంట్ కానీ రాలేదని వివరించారు. 201617ఆర్థిక సంవత్సరంలో 354.2 కోట్ల రూ.2000 నోట్లు ముద్రించినట్టు 2019 లో రిజర్వుబ్యాంకు వెల్లడించింది. అయినా 201718 లో 11.15 కోట్ల రూ.2000 నోట్లను ముద్రించారు. తరువాత 201819 లో ముద్రణ తగ్గించి 4.66 కోట్ల రూ. 2000 నోట్లు మాత్రమే ముద్రించారు. 2019 ఏప్రిల్ నుంచి కొత్తగా రూ.2000 నోట్లు ముద్రించడం లేదని మంత్రి వివరించారు.