Wednesday, January 22, 2025

రోజుకు రూ.20000 కోట్ల ఆన్‌లైన్ చెల్లింపులు

- Advertisement -
- Advertisement -

Rs 20,000 crore digital transactions per day

 

న్యూఢిల్లీ : దేశంలో ఇప్పుడు డిజిటల్ ఆర్థికలావాదేవీల ఘట్టం మరింత ఉజ్వలం అయిందని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. ఇప్పుడుఅధికారిక లెక్కలమేరకు చూస్తే దేశవ్యాప్తంగా రోజువారిగా రూ 20000 కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలు సాగుతున్నాయి. ఇది ఆర్థికంగానే కాకుండా సామాజికంగా తలెత్తిన కీలక పరిణామం అయిందని తెలిపారు. నెలవారి తమ మన్ కీ బాత్ రేడియో టీవీ ఇష్టాగోష్టి ప్రసార కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ ప్రత్యేకించి ఈ డిజిటల్ లావాదేవీల భారీ స్థాయి ఆదరణ జనం ఈ ధోరణికి క్రమేపీ అలవాటుపడటం వంటి అంశాలను ప్రస్తావించారు. ఆన్‌లైన్ చెల్లింపులు ఇప్పుడు గ్రామీణ స్థాయికి చివరికి తండాలు గూడెంల వరకూ విస్తరించుకుపోయిందని, ఇది క్రమేపీ భారీస్థాయి డిజిటల్ ఎకనామికి దారితీసిందని అన్నారు. ఆన్‌లైన్ పేమెంట్లలో సాంకేతిక లోపాలు ఉంటే వాటిని అధిగమించడం జరిగితే ఇక చెల్లింపుల ప్రక్రియలో సంపూర్ణ మార్పులు తథ్యమని ప్రధాని వివరించారు. ఆన్‌లైన్ పేమెంట్ల ప్రక్రియతో ఇక దేశంలో సంబంధిత సాంకేతికత, చెల్లింపుల పరికరాలు, యాప్‌ల రూపకల్పన వంటి పలు అనుబంధ హంగామా నెలకొంది. ఈ దిశలో అనేక ఫిన్‌టెక్ స్టార్టప్స్ అవతరించాయి. మరెన్నో రానున్నాయి.

ఈ విధంగా డిజిటల్ చెల్లింపుల ప్రక్రియకు అనుబంధంగా ఏకంగా ఓ పారిశ్రామిక వాతావరణం, ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా డిజిటల్ చెల్లింపులు కేవలం మనిషికి సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా డబ్బులు ఇచ్చిపుచ్చుకునే ప్రక్రియలో పారదర్శకత విశ్వసనీయత నిజాయతీకి దారితీస్తోందని, మోసాలకు అవకాశం ఉండదని అయితే డిజిటల్ చెల్లింపుల దశలో అంతా జాగ్రత్తగా ఉండాల్సి ఉం టుందని హెచ్చరించారు. రోజుకు 20వేల కోట్ల వరకూ డిజిటల్ లావాదేవీలు జరగడం చివరికి ఈ మార్చిలోనే ఈ ఏకీకృత చెల్లింపుల సార్వత్రిక వేదిక (యుపిఐ) నుంచి లావాదేవీలు డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడం మొత్తం మీద రూ 10 లక్షల కోట్ల రికార్డుకు చేరుకున్నాయని ప్రధాని గణాంకాలను వివరించారు. దేశ ప్రజలు తమ పూర్వ చరిత్ర విశేష ఘట్టాలను తెలుసుకుని తీరాల్సి ఉంది. తీరిక లేని దశ ఉందని అనుకోకుండా అంతా కనీసం సెలవు రోజులలో అయినా సమీపంలోని స్థానిక వివిధ మ్యూజియంలకు వెళ్లాలని ప్రధాని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News