Thursday, January 23, 2025

బిజెపి పాలిత రాష్ట్రాల్లో రూ.2016 పెన్షన్లు ఇస్తున్నారా?: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశాన్ని పాలిస్తున్న బిజెపి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ రాష్ట్రాలలో ఎక్కడైనా రెండు వేల రూపాయల పెన్షన్లు ఇస్తున్నారా? అని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అడిగారు. కూకట్ పల్లి నియోజకవర్గం లోని ఫతేనగర్ డివిజన్ లో ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హరీష్ రావు హాజరై లబ్ధిదారులకు ఆసరా కార్డులను అందజేశారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో 46 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, ఇప్పుడు 10 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందిస్తుంటే బిజెపి టిఆర్ఎస్ పార్టీలో మాత్రం పాదయాత్రలు సైకిల్ యాత్రలు, మోకల యాత్రలు చేస్తున్నారన్నారు. బిజెపి కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాలలో ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి చేశారా?.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు అందిస్తున్నారా? అని హరీష్ రావు ప్రశ్నించారు.

బిజెపి పాలిస్తున్న రాష్ట్రాలలో పక్కనే ఉన్న డబల్ ఇంజన్ సర్కార్ మహారాష్ట్రలో 2016 రూపాయల పెన్షన్లు ఇస్తున్నారని, కాంగ్రెస్ పాలిస్తున్న ఛత్తీస్ గఢ్ లో ఎంత పెన్షన్లు ఇస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 24 గంటల కరెంటు ఎక్కడ లేని విధంగా ఇంటింటికి మంచినీళ్లు అందిస్తూ ప్రజల కష్టాలను ముఖ్యమంత్రి కెసిఆర్ తీర్చుతున్నారని హరీష్ రావు ప్రశంసించారు. కల్లబొల్ల మాటలతోనే కాంగ్రెస్ , బిజెపి పార్టీలో ప్రజలను మభ్యపెడుతున్నారని, తప్ప ప్రజల కష్టాలను మాత్రం ఏ మాత్రం పట్టించుకోవట్లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. అతి తొందరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా డబుల్ బెడ్ రూమ్ లో అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి  ఎంఎల్ఎ మాధవరం కృష్ణారావు, ఎంఎల్ సి నవీన్ కుమార్ తో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News