Monday, December 23, 2024

పిఎం కిసాన్ పథకం కింద రూ.21వేలకోట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి సంబంధించి అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా 11 విడుత నిధులు విడుదలయ్యాయి. మంగళవారం ప్రధాని హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధాని పిఎం కిసాన్ కింద రూ.21వేలకోట్లు విడుదల చేశారు. మొత్తం రూ.10కోట్ల మంది ఖాతాలకు నిధులు నేరుగా జమ చేస్తున్నట్టు ప్రధాని మోది ఈ సందర్బంగా వెల్లడించారు. తొమ్మిది మంత్రిత్వ శాఖలద్వార ఆమలువుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, పోషణ అభియాన్, ప్రధానమంత్రి మాతృ వందన యోజన, స్వచ్ భారత్ మిషన్, జల జీవన్ మిషన్, ప్రధానమంత్రి స్వనిధి స్కీం, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన, ఆయుష్మాన్ భారత్ పింఎం ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత హెల్త్ వెల్నెస్, ప్రధానమంత్రి ముద్ర యోజన తదితర పథకాల పనితీరును ప్రధాని లబ్ధిదారులతో సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని కేంద్ర మెట్ట వ్యవసాయ పరిశోధనాకేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ లోని పథకాల ద్వారా ప్రజలు ఏవిధంగా ప్రయోజనాలు పొందుతున్నారు. తద్వారా వారి జీవన స్థితిగతులను ఏ విధంగా మెరుగు పరచుకుంటున్నారో తెలియజేశారు. మెరుగైన ఆహారం, వైద్యం, మేలురకం విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకై కోల్ స్టోరేజ్ లు, తక్కువ వడ్డీ రుణాలు తదితరాలను తమ ప్రభుత్వ హయాంలో ప్రజలకు చేరువయ్యాయన్నారు. పరిశోధనల ద్వారా అధికదిగుబడులను ఇచ్చే మేలురకం కొత్త వంగడాలనెన్నింటినో రైతులకు అందజేశామన్నారు.

వ్యవవసాయరంగంలో పంటల సాగుకు సంబంధించి విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు. మత్ససంపద అభివృద్ధికి బ్లూ రెవెల్యూషన్, పాడిపరిశ్రమ అభివృద్దికి వైట్ రెవెల్యూషన్ తెచ్చామన్నారు. పిఎం కిసాన్ పధకం ద్వారా ఇప్పటివరకూ కేంద్రం నుంచి రూ.2లక్షల కోట్లు రైతులకు అందజేశామన్నారు. 23రకాల పంటలను కనీస మద్ధతు ధరల పధకంలో చేర్చామన్నారు. 2014నుంచి ఇప్పటివరకూ మద్దతు థరలు పెంచుతూనే ఉన్నామన్నారు. కరోనా పరిస్థితుల్లో పేదలకు అండగా కేంద్ర ప్రభుత్వం ప్రతివ్యక్తికి 5కిలోల బ్యియం ఇచ్చిందని దీనిపై రూ.3.50లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. 2014లో బిజేపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి నేటి వరకూ ప్రధాని నరేంద్రమోడి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రతిరోజు తన కార్యాలయానికి వస్తూనే ఉన్నారని తెలిపారు. కొన్నిరాష్ట్రాల్లో కొందరు ముఖ్యమంత్రులు సెక్రటేరియట్‌కే రావటం లేదని, మరికోందరు సిఎంలు ఎన్నిరోజులు ఫాంహౌస్‌లో ఉంటారో తెలియటం లేదన్నారు. దేశం కోసం నిరంతరం శ్రమించే ప్రధానికి దేశ ప్రజలందరూ అండగా నిలవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విజ్ణప్తి చేశారు.ఈ కార్యక్రమంలో క్రీడా డైరెక్టర్ డా.వి.కె సింగ్, హిందుస్తాన్ పెట్రోటియం సంస్థ అధికారి రితీష్ కుమార్, ఇండియన్ ఆయిల్ సంస్థ ఈడి ఆర్ శ్రవణ్‌కుమార్, భారత్ పెట్రోలియం సంస్థ ఈడి అనితామోహన్ క్రీడా డిఆర్‌ఎం డా.కె.సమ్మిరెడ్డి, ప్రధానశాస్త్రవేత్త నాగశ్రీ, డా.అస్సార్ యాదవ్ తదితరులు. పాల్గొన్నారు. అనంతరం డా. వీ.కే.సింగ్ కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డిని సత్కరించారు. మంత్రి క్రీడా సంచాలకులతో కలసి కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థలోని వివిధ విభాగాలను, నిక్రా రీసెర్చ్ కాంప్లెక్స్, కృషి విజ్ఞాన కేంద్రం, ఉద్యానపంటల క్షేత్రం, విత్తన ప్రాసెసింగ్ యూనిట్ లను సందర్శించారు.

Rs.21 Crore Release under PM Kisan Scheme

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News