- Advertisement -
భాగల్పూర్(బీహార్): ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 19వ విడత కిస్తు రూ. 22000 కోట్లను దేశంలోని 9.8 కోట్ల రైతుల ఖాతాల్లోకి సోమవారం బదిలీ చేశారు. ఇదిలావుండగా ప్రధాని నరేంద్ర మోడీ బీహార్‌లో అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ముఖ్యమంత్రి నితీశ్ కుమార్,అనేక మంది కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎంఎల్‌ఏలు, అధికారులు కూడా ఉన్నారు. దీనికి ముందు భారత అన్నదాతల జీవితాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వ కట్టుబడి ఉందని ప్రధాని మోడీ అన్నారు. ‘ఎక్స్’ వేదికగా ‘మై గవర్నమెంట్ ఇండియా’ ఖాతా నుంచి ఆయన ఓ పోస్ట్ పెట్టారు. అందులో ‘మా అన్నదాతలు, వారి జీవితాలను మెరుగుపరచడానికి మా నిబద్ధత పట్ల మేము గర్విస్తున్నాము’ అని పేర్కొన్నారు.
- Advertisement -